తెలంగాణ ధ్వని : డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వరంగల్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్‌గా జె. కిరణ్ కుమార్‌ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్తుతం హన్మకొండలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్‌గా పనిచేయడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో కూడా సేవలందిస్తున్నారు.
ఇప్పుడు వరంగల్ జిల్లా పూర్తి అదనపు ఛార్జ్ బాధ్యతలు కూడా ఆయన భుజాలపైకి వచ్చాయి.జె. కిరణ్ కుమార్ ఔషధ నియంత్రణ రంగంలో అనుభవసంపన్నుడు. నిషేధిత ఔషధాల కల్తీ, అక్రమ నిల్వలపై దృష్టి సారించి, అనేక కేసులను దర్యాప్తు చేసి ప్రజా ఆరోగ్యానికి మేలు చేసిన అధికారి. ఆయన పలు స్ధాయిలలో పురస్కారాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రజల ఆరోగ్య భద్రతే మా ప్రథమ కర్తవ్యం. రాష్ట్ర స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసి, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాకు జె. కిరణ్ కుమార్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులవడంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ఫార్మసిస్టులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు మానవతా దృక్పథంతో ఔషధ భద్రతను అందించడమే తన లక్ష్యమని జె. కిరణ్ కుమార్ అన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక