తెలంగాణ ధ్వని: వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది.
– మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
– ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
– ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం
వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలు.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన జినుకల ప్రవళిక (25) నిండు గర్భంతో కాన్పు కోసం ఆదివారం రాత్రి వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. గర్భిణీకి అన్ని రకాల పరీక్షలు చేసి సోమవారం ఉదయం 9 గంటలకి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. 10 గంటలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆడపిల్ల పుట్టింది తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్థగంట గడవకముందే ప్రవళికకు తీవ్ర రక్త స్రావం కావడం ప్రారంభమైంది. వెంటనే వైద్యులు మరల ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి సుమారు 15 యూనిట్ల రక్తము ఎక్కించడం జరిగింది. అయినను రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం ప్రవళికను హనుమకొండ లోని వేరే ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. తీరా అక్కడికెళ్లాక ప్రవళిక మరణించిందని వైద్యులు తెలిపారు.
దీంతో ఆందోళనకు గురైన ప్రవళిక భర్త రాజు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులను అడగగా మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మాకు సరైన న్యాయం చేయాలని ఆస్పత్రి ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఏలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.
రిపోర్టర్: కిరణ్ సంగ…