- 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి
తెలంగాణ ధ్వని : వరంగల్ 40వ డివిజన్‌లో తేలిక వర్షాలు కురిసినా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని మహానగరపాలక సంస్థ (GHMC) అధికారిని ఎంహెచ్ఓ రాజేష్ గారికి కార్పొరేటర్ మరుపల్ల రవి గారు తెలియజేశారు.
వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన ఎంహెచ్ఓ రాజేష్ గారు, కార్పొరేటర్ మరుపల్ల రవితో కలిసి డీకే నగర్, ఉప్పరోనికుంట, ప్రతాప్ నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.కార్పొరేటర్ మరుపల్ల రవి గారు మాట్లాడుతూ, డివిజన్‌లో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని,
ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. శానిటేషన్ సిబ్బందిని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎంహెచ్ఓ రాజేష్ గారు మాట్లాడుతూ, ప్రతి శానిటేషన్ సర్కిల్‌కు ఒక JCB, రెండు ట్రాక్టర్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని,
దీంతో బాక్స్ డ్రైనేజీలలో పేరుకుపోయిన మురుగు, చెత్తను సమర్థవంతంగా తొలగించవచ్చన్నారు. డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో ఇంట్లో వాడిన నీటిని బయటకు వదలకుండా ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాలని ప్రజలకు సూచించారు.
శానిటేషన్ సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్రం శ్రీను, శానిటేషన్ జవాన్లు రమేష్, కృష్ణ, ఆదాం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక