తెలంగాణ ధ్వని : కేంద్ర ప్రభుత్వ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, “ఆపరేషన్ కగార్” పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను తక్షణమే నిలిపివేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్‌లోని దేశోద్దారక భవన్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సదస్సులో ఎంఎల్‌సీ నెల్లికంటి సత్యం, జస్టిస్ బి. చంద్రకుమార్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ(ఎం)ఏల్ న్యూ డెమోక్రసీ వర్గం నుండి వేములపల్లి వెంకట్రామయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ నేత కె.జి. రాంచందర్, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ(ఎంఎల్) కార్యదర్శి ప్రసాదన్న, ఆర్ఎస్‌పి నేత జానకిరాములు, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి రాజా రమేష్, ఎస్(కమ్యూనిస్టు) నేత సిహెచ్ మురహరి, పార్వర్డ్ బ్లాక్ నేత ప్రసాద్, సిపిఐ న్యూడెమోక్రసీకి చెందిన విశ్వనాధ్, అరుణోదయ ప్రతినిధి విమలక్క తదితరులు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ, మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారని, అయితే కేంద్ర ప్రభుత్వం వారి పై అనవసరమైన దాడులు కొనసాగిస్తున్నది. “ఆపరేషన్ కగార్” ద్వారా ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని 25,000 మంది కేంద్ర సాయుధ బలగాలతో కర్రెగుట్టల్ని అక్రమంగా చుట్టి వారిపై దాడులు చేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని వారిని శాంతి చర్చలకు పిలవాలని, దుష్ప్రచారం మరియు భయపెట్టే చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక