తెలంగాణ ధ్వని : టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్, సుపరిచిత నటుడు, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.
సినిమాలలో మెలకువ, హాస్యంతో పాటు కుటుంబ విలువలపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసుకున్న వెంకటేష్, ఆరుపదుల వయసులో కూడా సినిమాలపై మక్కువ కొనసాగిస్తున్నారు.
ఇటీవలే ఆయన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఇదిలా ఉండగా, వెంకటేష్ కుటుంబ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీటిలో విక్టరీ వెంకటేష్, అతని భార్య నీరజ, సురేష్ బాబు, అతని భార్య, చెల్లెలు లక్ష్మీ, అమ్మ రాజేశ్వరి, రామానాయుడు, నాగ చైతన్య వంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీనికి సంబంధించిన ఫొటోలు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ “సూపర్ ఫ్యామిలీ” మరియు “నైస్ పిక్స్” అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.విక్టరీ వెంకటేష్ కుటుంబం గురించి కనిపించే ఈ అరుదైన ఫొటోలు వారి అభిమానులను ఆనందానికి గురిచేస్తున్నాయి.
ఈ సందర్భంగా అభిమానులు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మీడియా వేదికలపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఈ ఫొటోలపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక