telanganadwani.com

AlluArjunAtlee

వెయ్యి కోట్ల బడ్జెట్‌తో అల్లు అర్జున్ సంచలనం: అట్లీ దర్శకత్వంలో డ్యూయల్ రోల్!..

తెలంగాణ ధ్వని : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ.

ఈసినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు టీం. ఇక సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనుంది.

కాగా ఈ సినిమాను మునిపన్నడు లేని విధంగా సరికొత్త పంథాలో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారట మూవీ టీం. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మొదట్లో ఈ సినిమాకు హీరోయిన్గా సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాగూర్ సెలెక్ట్ అయిందని..MARUNAL

సినిమా లుక్ టెస్టులు కూడా పూర్తయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా బన్నీ.. మృణాల్ ఫ్రెష్ పెయిర్ ఆడియన్స్‌కు కొత్త ఫీల్ కలిగిస్తుందని.. సినిమా మెప్పిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట

అంతేకాదు.. ఈమెతో పాటే సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని..JANVI DEEPIKA
వారిలో ఒకరు జాన్వికపూర్ కాగా.. మరో హీరోయిన్ దీపిక కూడా ఈ సినిమాల్లో బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుందట. ఈ ముగ్గురు హీరోయిన్ల క్రేజ్ రీత్యా సినిమాపై మరింత హైప్‌ పెరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు..

బన్నీ కెరీర్‌లోనే మొట్టమొదటిసారి డ్యూయల్ రోల్‌లో ఈ సినిమాలో నటించనుందని సమాచారం. ఇక దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top