తెలంగాణ ధ్వని : వరంగల్ నాటక రంగంలో తన ప్రతిభతో ఇబ్బంది పడ్డా ఆత్మీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శతపతి శ్యామల రావు గారు అకాలమరణం చెందారు.
అనారోగ్యం తట్టుకోలేకపోయినా, చివరి నాటకం వరకు ఆయన నాటక రంగంపై ఉన్న అంకితభావాన్ని మర్చిపోలేరు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్లి రవి మాట్లాడుతూ,
శ్యామల రావు గారు నరకాసుర వధ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, యువ కళాకారులకు అవకాశాలు సృష్టించి, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని పంచేవారు అని గుర్తు చేశారు.
శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా చేరి, UDC స్థాయి వరకు ఎదుగుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రైవేట్‌గా పాఠాలు నేర్పిస్తూ ఆయన విద్యా రంగంలోనూ తన సేవలను అందించారని.
మరుపల్లి రవి వెల్లడించారు. శ్యామల రావు గారి మరణంతో నాటక రంగం మాత్రమే కాదు, విద్యా రంగం కూడా లోటుకు పడినట్లు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక