తెలంగాణ ధ్వని : దక్షిణ భారత సినీ పరిశ్రమలో టాప్లో ఉన్న బ్యూటీ శ్రీలీల, తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆత్మీయమైన ఫోటో షేర్ చేసి అందరినీ అలరించింది. 2025 ఏప్రిల్ 27న, తన ఇంస్టాగ్రామ్ లో ఓ చిన్నారితో దిగిన రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా శ్రీలీల తన సినిమా ప్రాజెక్ట్స్ నుంచి గ్యాప్ తీసుకున్నప్పటికీ, పుష్ప-2లో చేసిన ఐటెం సాంగ్ తరువాత మళ్ళీ హాట్ టాపిక్ అయింది. వరుసగా సినిమాల ఆఫర్లు వస్తున్నా, ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా సినిమాలు చేస్తున్నాయి.
బ్యూటిఫుల్‌గా కనిపించే శ్రీలీల, తన మనసును కూడా అందరికి ప్రదర్శిస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటూ పోతుంది.గతేడాది శ్రీలీల ఓ ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడి దివ్యాంగులైన గురు మరియు శోభిత అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది.
ప్రస్తుతం వారి పెంపకం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలను శ్రీలీల సమర్థంగా చూసుకుంటుంది. తాజాగా, మూడో పాపను కూడా దత్తత తీసుకున్నట్టు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది.
“మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చారు. మా హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది,” అని శ్రీలీల ఆ పోస్టులో రాసింది. ఈ పోస్టును చూసిన అభిమానులు ఆమెను అభినందిస్తూ, అనాథ పిల్లల్ని ఆదరిస్తున్న శ్రీలీలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రస్తుతం శ్రీలీల మాస్ జాతర మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తోంది, మరియు ఆమె సుదీర్ఘ ప్రయాణంలో విజయాలు సాధిస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుస్తోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక