telanganadwani.com

SriVarshini

శ్రీవర్షిణిని గుజరాత్‌లో గుర్తించిన పోలీసులు – కుటుంబానికి అప్పగింపు

తెలంగాణ ధ్వని : ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువతి శ్రీవర్షిణి వివాదాస్పద పరిణామాల్లో నుంచి బయటపడింది. రెండు నెలల క్రితం ఓ లేడీ అఘోరీ నాగసాధు ప్రలోభాలకు గురై ఆమె తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయినట్లు శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో కలకలం రేపింది. మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీని ఓ సందర్భంలో తమ ఇంటికి పిలిచి బట్టలు ఇచ్చామని, అదే సమయంలో ఆమె తమ కూతురిని మాయ చేసి తీసుకెళ్లినట్లు వారు చెప్పారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి శ్రీవర్షిణి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవర్షిణి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళగిరి పోలీసులకు సమాచారం అందించడంతో, వారు యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

తద్వారా కుటుంబ సభ్యులు గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ శ్రీవర్షిణిని లేడీ అఘోరీ నుంచి విడిపించి తిరిగి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవర్షిణి, లేడీ అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ ఆమె పెట్టిన మొరలతో సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమె తన ఇష్టంతో అఘోరీతో వెళ్లినట్లు చెప్పినప్పటికీ, తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆమెను తప్పింప చేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళగిరి పోలీసులు తెలిపారు. వర్షిణిని తమ కూతురిగా తిరిగి పొందిన తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆమెను మంగళగిరికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో శ్రీవర్షిణి స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top