తెలంగాణ ధ్వని: యంగ్ బ్యూటీ చాందిని చౌదరి(Chandini Chowdary), విక్రాంత్(Vikranth) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు'(Santhana Prapthirasthu). సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. మధుర ఎంటర్ టైన్ మెంట్((madhura Entertainment), నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్(Nirvi Arts Banners) పై మధుర శ్రీధర్ రెడ్డి(Madhura Sridhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి(Nirvi Hariprasad Reddy)లు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సునీల్ కశ్యప్(Sunil Kashyap) సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore), అభినవ్ గోమతం(Abhinav Gomatham), జీవన్‌కుమార్(Jeevan Kumar), తరుణ్ భాస్కర్(Tharun Bhaskar), తాగుబోతు రమేష్(Thagubothu Ramesh)లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈచిత్ర టీజర్(Teaser)ను విడుదల చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. టీజర్‌ను గమనించినట్లయితే.. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న ఓ యువకుడు తన భార్యను గర్భవతిని చేయడానికి కష్టపడుతున్న కథలా అనిపిస్తోంది. 100 రోజుల్లో గర్భవతిని చేయాలనే కండిషన్ పెట్టగా.. ఆ టైమ్‌లోగా అతడి భార్య గర్భవతి అయిందా లేదా అనే కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సూపర్ ఫన్ అండ్ ఎంటర్‌టైనర్‌గా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
రిపోర్టర్: కిరణ్ సంగ…