తెలంగాణ ధ్వని : లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా *ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ గారు* సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
లష్కర్ బోనాల సందర్భంగా ఇప్పటికే ఆలయ పరిసరాలు భక్తులతో కిటికటలాడుతున్నాయి. ఆషాడమాసంలో జరిగే బోనాల జాతరకు చాలా ప్రత్యకత ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే ఈ పండుగ సందర్భంగా జరుపుకుంటున్నారు. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహిస్తోంది.
సీఎంతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బంగారు దత్తాత్రేయతోపాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రత్యేక పూజల సందర్భంగా మంత్రులు , పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, హర్కర వేణుగోపాల్ రావు గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, శ్రీగణేశ్ గారు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు దక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
#లష్కర్‌బోనాలు #ఉజ్జయినిమహంకాళి #తెలంగాణపండుగలు #బోనాలుజాతర #రేవంత్‌రెడ్డి #కొండాసురేఖ #తెలంగాణసంస్కృతి #సికింద్రాబాద్ #బోనం #ఆలయదర్శనం #పట్టు వస్త్రాలు #ప్రత్యేకపూజలు #తెలంగాణసాంప్రదాయం #భక్తులు #ఆషాడమాసం #తెలంగాణప్రభుత్వం #200ఏళ్లఆలయం #తెలంగాణఆస్తి #దేవాదాయశాఖ #పౌరభక్తి #వైభవోత్సవం