telanganadwani.com

GaddarAwards

సినీ రంగానికి ప్రోత్సాహం – గద్దర్ అవార్డుల వివరాలను వెల్లడించిన దిల్ రాజు

తెలంగాణ ధ్వని : తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను (Gaddar Awards) ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే
ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఏప్రిల్‌ నెలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు.”గద్దర్‌ అవార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. పైడి జయరాజ్‌, కాంతారావు పేరుతో గౌరవ పురస్కారాలు అందించనున్నాం. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు ఇవ్వనున్నాం. 2014 జూన్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకూ విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. 2024కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులతో పాత రోజుల్లోని అవార్డుల ప్రక్రియనే కొనసాగించనున్నాం. ఏప్రిల్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తుదారులు ఎఫ్‌డీసీకి కొంత డబ్బు పంపించినట్లు తెలిసింది. ఆ డబ్బును వారికి ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తాం. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు. దీనిని ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా అనుకుని విజయవంతం చేయాలి. అప్పుడే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోగలం” అని ఆయన కోరారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top