telanganadwani.com

CentralBankOfIndia

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – పీజీడీబీఎఫ్ కోర్సు నోటిఫికేషన్ 2025

తెలంగాణ ధ్వని : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు ద్వారా అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో శిక్షణ పొందే అవకాశం పొందుతారు.

  • ముఖ్య వివరాలు:
  • ఖాళీలు: మొత్తం 1000 పోస్టులు.
  • విద్యార్హత: నవంబర్ 30, 2024 నాటికి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • వయో పరిమితి: 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150; ఇతర అభ్యర్థులకు రూ.750.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025.
  • ఎంపిక విధానం:
  • ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీగా ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 45% మార్కులు అవసరం, ఇతర అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి.
  • కోర్సు వివరాలు:
  • పీజీడీబీఎఫ్ కోర్సు మొత్తం 1 సంవత్సరం ఉంటుంది, ఇందులో 9 నెలలు తరగతి గది శిక్షణ, 3 నెలలు ఆన్-జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక, అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ ఇస్తారు. కోర్సు ఫీజు సుమారు రూ.3 నుండి రూ.4 లక్షల వరకు ఉంటుంది. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంకు రుణం అందిస్తుంది.
  • స్టైఫండ్ మరియు వేతనం:
  • కోర్సులో పాల్గొనేవారికి మొదటి 9 నెలలు నెలకు రూ.2,500 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. తర్వాత, 3 నెలల ఆన్-జాబ్ ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.10,000 చొప్పున ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత, జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీసర్ హోదాతో సెంట్రల్ బ్యాంక్‌లో నియమిస్తారు. ప్రారంభ వేతనం రూ.48,480 ఉంటుంది, హెచ్ఎస్ఏ, డీఏ, అలవెన్సులతో కలిపి సుమారు రూ.70,000 వరకు నెలవారీ వేతనం పొందవచ్చు.
  • దరఖాస్తు ప్రక్రియ:
  • ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.centralbankofindia.co.in/en/recruitments) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలు, సిలబస్ వంటి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
  • రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top