తెలంగాణ ధ్వని: హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలా? అనే అంశంపై సాగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పాల్గొన్న మేధావులు, రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేయాలి అనే అంశంపై సంపత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్,కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ… దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేద్కర్ బలంగా కోరే వారన్నారు. దేశ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ సరిహద్దు నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరం ఉందని ప్రస్తావించారు. శత్రు దేశాలు రాజధాని కింత దగ్గరగా ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదని చెప్పారు.
ఎప్పుడైతే దేశంలో కులం, మతం ఆధారంగా రాజకీయాలు ప్రారంభమవుతాయో, అప్పుడు దేశంలో జాతీయ నాయకుడు అనే వారే ఉండరని అప్పట్లోనే అంబేద్కర్ చెప్పారన్నారు. ప్రజాస్వామ్యం పట్ల తనకు పూర్తిగా నమ్మకం ఉందని, భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలంటే కుల మతాలకతీతంగా ఐక్యం కావాలన్నారు. అదేవిధంగా ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు తొలగిపోవాలన్నారు. ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సూత్రం పనికిరాదన్నారు. ఒక రాష్ట్రం ఒక భాష మాట్లాడే వారు ఉండాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఒకే భాష మాట్లాడే వారందరినీ చరిత్ర ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే రాష్ట్రంలోకి తీసుకొస్తే అసమానతలు పెరిగి అంతర్గత వైరుధ్యాలు పెరుగుతాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూడా బలపడనీయదన్నారు.
అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కల్పించే విధంగా ఉండాలన్నారు..
ఈ సమీక్ష సమావేశం ద్వారా హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని కొందరు ,మరికొందరు హైదరాబాద్ రెండో రాజధాని అయితే తెలంగాణ ఆదాయం హైదరాబాద్ కు మాత్రమే చెందే విధంగా ఉండాలన్న భిన్న అభిప్రాయాలు తెలుసుకున్నాను అన్నారు. అందుకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం పరంగా ప్రజలందరి కొరకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు మేధావులు పలువురి విశ్లేషణల పరంగా తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లకుండా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తోడ్పాటు కై అన్ని విధాలుగా సమన్యాయ పరంగా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండో రాజధాని అనే అంశం పట్ల లోతైన చర్చ జరగాల్సి ఉందన్నారు. పునర్ ఆలోచించాలన్నారు. ఆర్థిక వనరులపై రాష్ట్రాల వాటాలపై తేడాలు ఉన్నాయన్నారు. నది జలాలపై, యూనివర్సిటీలు, ప్రతి రంగంలో ఆధిపత్య ధోరణి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ రెండో రాజధానిగా కుదరదని, కేంద్ర పెత్తనానికి దారతీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్వయంగా చూడాలన్నారు. పరిపాలన సౌలభ్యంగా అందుబాటులో ఉండేటట్టు, దక్షిణాది రాష్ట్రాలో కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు.
అందులో భాగంగా హైదరాబాదులో సుప్రీంకోర్టుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా శీతాకాలంలో అనువైన ప్రదేశంగా పార్లమెంట్ సమావేశాలు హైదరాబాదులో నిర్వహించాలన్నారు. మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కీలకమైన అంశాల పట్ల సమన్యాయం కావాలన్నారు. ఆ దిశగా హైదరాబాద్ కు అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్టు ఉండాలని కోరారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలను సమానంగా చూసి సమనత్వం, న్యాయం కల్పించాలన్నారు.
హైదరాబాద్ రెండో రాజధానిగా మారాల్సిన కారణాలు:
1. **భౌగోళిక సౌలభ్యం** – దేశ మధ్య భాగంలో ఉన్న హైదరాబాద్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో ఉంది.
2. **రక్షణ దృష్టికోణం** – ఢిల్లీ పాకిస్తాన్ సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండటంతో, అత్యవసర పరిస్థితుల్లో పరిపాలన సులభతరం కావాలి.
3. **అధునాతన మౌలిక వసతులు** – ఐటి, రవాణా, పరిశ్రమలు అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ అనువైనత కలిగి ఉంది.
4. **దక్షిణాది రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం** – దేశ పరిపాలనా వ్యవస్థ ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా, దక్షిణ భారతాన్ని కూడా సమర్థంగా ప్రతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది.
**హైదరాబాద్ రెండో రాజధానిగా మారితే ఎదురయ్యే సవాళ్లు:**
1. **తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం** – రాష్ట్ర ఆదాయం హైదరాబాద్‌కే పరిమితం అవుతుందా అనే అనుమానం.
2. **కేంద్ర పాలన పెరుగుతుందా?** – కేంద్ర ప్రభుత్వ అధికార హస్తక్షేపం పెరిగి, రాష్ట్ర ప్రభుత్వాల అధికారం తగ్గుతుందా అనే సందేహం.
3. **ప్రయోజనాలు, నష్టాలపై లోతైన అధ్యయనం అవసరం** – పరిపాలన పరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏమైనా నష్టాలుంటాయా అనే అంశంపై విశ్లేషణ కావాలి.
ప్రతిపాదిత మార్గాలు:
**హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు**
**పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహణ**
**దక్షిణాది రాష్ట్రాలకు పరిపాలన సౌలభ్యంగా కేంద్ర కార్యాలయాల విస్తరణ**
దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
రిపోర్టర్: కిరణ్ సంగ…