తెలంగాణ ధ్వని : హైదరాబాద్ పోలీసులు ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును అరెస్టు చేశారు. గత నాలుగేళ్లుగా గంజాయి వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తూ, వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి.
దూల్‌పేట ప్రాంతంలో 41.3 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ గతంలో పట్టుబడిన ఆమె, అనంతరం తప్పించుకుంది. ఒడిశాలో తలదాచుకున్న ఆమెను ఎట్టకేలకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు, స్థానిక పోలీసుల సహాయంతో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
సామాజిక మాధ్యమాల్లో సినీ నటిలా వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ, గంజాయి వ్యాపారం కొనసాగించడం విశేషం. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో గంజాయి సరఫరా ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు, మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక