telanganadwani.com

MissWorld2025

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల ఘనత – తెలంగాణ ప్రభుత్వం చేసిన భారీ ఏర్పాట్లు…

తెలంగాణ ధ్వని : ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హోస్ట్ చేసే అరుదైన గౌరవాన్ని పొందిన హైదరాబాద్, ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 51 దేశాలకు చెందిన అందాల ప్రదినిధులు నగరానికి చేరుకున్నారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల కంటెస్టెంట్లు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ సందర్భంలో, తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కంటెస్టెంట్‌కు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా సాంప్రదాయ వస్త్రధారణతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలుకుతున్నాయి.

రాష్ట్రం ఆతిథ్య పరంగా తన విస్తృతతను చాటుతోంది.ప్రత్యేకంగా, అధికార యంత్రాంగం, సంఘటిత సిబ్బంది 24 గంటలూ పనిచేస్తూ, వచ్చిన అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటానికి కట్టుబడి ఉన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వసతి కేంద్రాల వరకు వాహనాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఆతిథ్య సేవలను అధిక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని దేశాల నుంచి అందాల రారాణులు హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున, నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

మిస్ వరల్డ్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించి, హైదరాబాద్‌ను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top