తెలంగాణ ధ్వని : భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన మిస్‌వరల్డ్ (Miss World pageant) పోటీలపై తీవ్ర ఉత్కంఠత మొదలైంది.
మిస్ వరల్డ్ పొటీలపై ప్రభావం
సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు అవుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు కొనసాగిస్తే ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు యోచిస్తున్నారు. మిస్ వరల్డ్ వేడుకలకు 116 దేశాల నుంచి అందాల భామలు రావాల్సి ఉండగా.
గురువారం సాయంత్రానికి 109 మంది వచ్చినట్లు అంచనా. ఇంకా స్పాన్సరర్స్, అంతర్జాతీయ మీడియా రావాల్సి ఉంది. అయితే పాక్-భారత్‌ల ఉద్రిక్తల నేపథ్యంలో దాదాపు 200 విమాన సర్వీస్‌లు రద్దు, ఎయిర్‌పోర్టులు తాత్కలిక మూసివేత, విమానాల రూట్స్ మార్పు చేసిన విషయం తెలిసిందే.
దీంతో మిగతా వారు రావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది మిస్ వరల్డ్ పొటీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కన్పిస్తోంది.దేశంలో రసవత్తరంగా కోనసాగుతున్న ఐపీఎల్ -2025 మ్యాచ్‌లను బీసీసీఐ వాయిదా వేసినట్లు ప్రకటించింది.
దీంతో మిస్‌వరల్డ్ పోటీలు జరిగేనా? అని సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ దారిలోనే మిస్‌వరల్డ్ నిర్వాహకులు కొన్ని రోజుల వరకు వాయిదా వేస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.
ఇక ఈ నెల 12 నుంచి నాగార్జునసాగర్ బుద్ధవనం, పాతబస్తీ చార్మినార్, లాడ్‌బజార్, వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లలో ముద్దుగుమ్మలు పర్యటించేలా ప్రభుత్వం ఔట్‌డోర్ ప్రణాళిక రూపొందించింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో సుందరీమణులకు భద్రత పెద్ద సవాల్‌గా మారింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి ఉంది. మరోవైపు అందాల పోటీలకు వ్యతిరేకంగా నిరసనలు సైతం వస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, సీపీఐ ఈ పోటీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రిపోర్టర్. ప్రతీప్