- ముఖ్య అతిధిగా పాల్గొన్న40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి..
తెలంగాణ ధ్వని : హనుమాన్ జయంతి సందర్భంగా శివాంజనేయ స్వామి దేవాలయంలో పురోహితులు వెలిదె అనంతశర్మమూర్తి అయ్యగారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 102 మంది హనుమాన్ స్వాములకు అయ్యగారు ఇరుముడి కట్టారు.
ఇరుముడి కట్టుకున్న స్వాములలో కొందరు కొండగట్టు, భద్రాచలం, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు . ప్రత్యేకంగా కొండగట్టు దేవాలయానికి మూడు రోజుల క్రితం కొంత మంది స్వాములు పాదయాత్రను ప్రారంభించారు.
దేవాలయ ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు, దీనిలో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి పాల్గొని పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో అనేక మంది భక్తులు, స్వాములు పాల్గొన్నారు. ఈ పూజలు, కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కలిగించాయని దేవాలయ అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి వేడుకలు భక్తి భావనను మరింత పెంచాయని తెలిపారు..
రిపోర్టర్. ప్రతీప్ రడపాక