తెలంగాణ ధ్వని : ఈ రోజు, ఐఏన్ టియూసీ గ్రేటర్ వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో జిడబ్ల్యూఏమ్ సి కెనరా బ్యాంక్ మేనేజర్ గారిని కలిసి. మున్సిపల్ అవుటో సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై చర్చించడం జరిగింది గతంలో, కార్మికులకు 50,000 రూపాయల రుణం మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం వారి అర్థిక అవసరాలు మరింత పెరిగిన నేపథ్యంలో వారికీ మళ్లీ సహాయం చేయాలని ఐఏన్ టియూసీ గ్రేటర్ వరంగల్ కమిటీ, బ్యాంక్ మేనేజర్‌కు 1 లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమం సాంఘిక బాధ్యతను గుర్తించి, కార్మికుల ఆర్థిక సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా జరిగినది. మున్సిపల్ అవుటో సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఈ రుణం మంజూరైతే, వారి కుటుంబాలకు ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలను తీర్చుకునే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఐఏన్ టియూసీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు పాశం రవి యాదవ్, జనరల్ సెక్రటరీ డి. రమేశ్, సిహెచ్ సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరబోయిన గట్టయ్య, కార్యదర్శి ఎస్. శేఖర్, పి. ధర్మారావు, డబ్ల్యూ. సత్యనారాయణ, ప్రమీల, స్వరూప, సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. దీప్తి