తెలంగాణ ధ్వని : మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ నగరంలో జరగనుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పోటీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పోటీలను నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలతో నిర్వహించనున్నారు. పోటీల సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి అందాలభామలు తెలంగాణకు విచ్చేస్తారు.
వారి ద్వారా రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఈ పోటీలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడానికి దోహదపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
పర్యాటక శాఖ ఈ సందర్భంగా ప్రత్యేక ప్రచార ప్రణాళికను రూపొందించింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. వారివల్ల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి.
ఇది విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మంచి అవకాశంగా మారుతుంది. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఇది మద్దతుగా నిలవనుంది.
అంతర్జాతీయంగా తెలంగాణను చాటిచెప్పే వేదికగా ఈ పోటీలు నిలుస్తాయి. యువతకు ఇదొక విశేషమైన అనుభవాన్ని అందిస్తుంది. మొత్తంగా, మిస్ వరల్డ్ 2025 పోటీల ద్వారా తెలంగాణకు గుర్తింపు, అభివృద్ధి, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక