తెలంగాణ ధ్వని : సుశీలా మీనా.. ప్రస్తుతం ఈ బాలిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల సచిన్ టెండుల్కర్ ఈ బాలిక వేసిన బౌలింగ్ వీడియోను పోస్టు చేశారు.
ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ లాగే బాలిక బౌలింగ్ యాక్షన్ ఉందంటూ ట్వీట్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ బాలిక క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలైంది. అప్పటి నుంచి తాను ఎవరని, ఎక్కడ నుంచి వచ్చిందని నెటిజన్లు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చేపుతున్నారు. నిజంగానే తానొక సూపర్ ఫాస్ట్, ప్రొఫెషనల్ బౌలర్లా బౌలింగ్ చేస్తుండడాన్ని చూసి.. భవిష్యత్తులో టీమిండియాకు ఆడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరీ సుశీలా మీనా..
సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటినుంచి క్రికెట్‌పై విపరీతమైన ఆసక్తి చూపించింది. క్రికెట్ ఆడటానికి తగిన సౌకర్యాలు లేకున్నా, తన ప్రతిభను ప్రతి అవకాశంలో నిరూపించుకుంటూ వచ్చింది. ప్రతిరోజూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అలా ప్రాక్టీస్ చేస్తూ.. గంటకి 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నేర్చుకుంది. ఇంకో వింతేమిటంటే.. సుశీలాకి సచిన్ అంటే ఎవరో తెలియదట. ఇంట్లో టీవీ లేదని, ఎప్పుడూ క్రికెట్ కూడా చూడలేదని చెబుతోంది. ఆమెకి తెలియని వ్యక్తే.. ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రపంచమంతా తెలిసేలా చేశాడు సచిన్.
కేంద్ర మంత్రిని క్లీన్ బౌల్డ్..
కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల రాజస్థాన్ పర్యటన సందర్భంగా సుశీలా మీనాతో సరదాగా క్రికెట్ ఆడారు. ఆ సందర్భంగా సుశీల వేసిన బంతిని ఆడడానికి ప్రయత్నించగా, రాజవర్ధన్ సింగ్ రాథోడ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. అక్కడే ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ.. సుశీలాను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

మరోవైపు, సుశీల ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. శిక్షణకు సంబంధించిన ఖర్చును కూడా అసోసియేషన్ భరిస్తోంది. మాజీ క్రికెటర్లు సుశీలా భవిష్యత్తుపై చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుశీలా ఒక మట్టిలో పుట్టిన మాణిక్యమని.. సరైన శిక్షణ అందిస్తే ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకు భవిష్యత్ నాయకురాలిగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఆమె బౌలింగ్ శైలి చూస్తే దేశానికి గర్వించదగిన ఆటగాళ్లలో ఒకరిగా మారుతుందనే నమ్మకం ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశీలా మీనా తన ప్రతిభతోనే కాదు, తపనతో కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు దోహదపుడుతుంది.

రిపోర్టర్:ప్రతీప్ రడపాక.