telanganadwani.com

తెలంగాణ ప్రభుత్వానికి కొత్త పింఛన్ దారులపై శుభవార్త

తెలంగాణ ధ్వని న్యూస్ : ప్రజా సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ దారులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా కొత్త ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసినట్లుగా వెల్లడించింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం తగిన కసరత్తులు ప్రారంభించబోతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల మంది 11 రకాల పింఛన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త పింఛన్ల కేటాయింపులో చనిపోయిన పింఛన్ దారుల స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చే అంశంపై కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతోంది.

ప్రక్రియను వేగవంతం చేసే నిర్ణయం
త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల ముందు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. బడ్జెట్‌లో కొత్త పింఛన్ల కోసం తగిన నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపనున్నారు.తెలంగాణ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ ప్రక్రియలో వేగంగా ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా కృషి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top