తెలంగాణ ధ్వని న్యూస్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం (జనవరి 24) ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా, కౌశిక్ రెడ్డిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో తీసుకున్న వైఖరి పట్ల తన అభిప్రాయాన్ని చెప్పారు.
“మంత్రిని స్టేజ్‌పై ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదు,” అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “యువ రాజకీయ నాయకుడికి ఆవేశం పనికిరాదు. కౌశిక్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోకపోతే, భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది” అని ఆయన హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డితో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని స్పష్టం చేశారు
ఇటీవల, కరీంనగర్ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేదికపై ఉండగానే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ గొడవలో కౌశిక్ రెడ్డి సంజయ్‌ను నెట్టివేసి వివాదం రేపాడు. దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక