telanganadwani.com

జాగ్రత్త.. శ్రీశైలంలో నకిలీ దర్శన టిక్కెట్లు

తెలంగాణ ధ్వని: ఏపీలోని (AP) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam) భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ దర్శన టికెట్లు అంటగడుతూ నిలువునా దోచేస్తున్నారు. దర్శనానికి వెళ్లిన తర్వాత తీరా ఆ టికెట్లు నకిలీవి అని తేలటంతో లబోదిబోమంటున్నారు. తాజాగా శ్రీశైలంలో నకిలీ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. ఇటీవల కాలంలో భక్తులు తరచూ ఈ తరహా మోసాలకు గురవుతుండటం గుర్తించిన దేవస్థానం సీఈవో మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న ఇద్దరు కేటుగాళ్లను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. పాత దర్శనం టికెట్లును ఎడిటింగ్ చేసి భక్తులు అమ్మి మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. నకిలీ టికెట్ల అమ్మకాలు భక్తులు టికెట్లు కొనుగోలుపై అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 14న శ్రీశైలం మల్లన్న దర్శనానికి కొంతమంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు వారికి దర్శన టికెట్లు ఇస్తామని చెప్పి భక్తుల నుంచి వేల రూపాయలు తీసుకున్నారు. వాటిని తీసుకుని సదరు భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. తమ వంతు రాగానే స్కానింగ్ సెంటర్ దగ్గర టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. కానీ, ఆ టికెట్లు స్కాన్ కాకపోవడంతో వారిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని ఫేక్ టికెట్లుగా తేల్చారు. దీంతో భక్తులు, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ తరహా మోసాలపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు ఆలయంలోనే సంబంధిత టికెట్లు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top