తెలంగాణ ధ్వని : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, సాంస్కృతిక విహార్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ద్వారా గ్రామీణ యువత, ముఖ్యంగా మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం అందిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు ఉద్యోగానికే పరిమితం కాకుండా, స్వయం ఉపాధిని ఎంచుకుని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని పొందగలరు.SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ భాస్కర్ రవి మాట్లాడుతూ, “ఈ శిక్షణ నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం. ప్రతి యువతి, యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.ఉద్యోగానికే పరిమితం కాకుండా, స్వయం ఉపాధి ద్వారా స్వంతంగా ఆదాయం పొందగలుగుతారు
మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చు ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక రుణ పథకాలు పొందే అవకాశం ఉంటుంది .
“శిక్షణలో అందించే కోర్సులు”
- జర్దోషి మగ్గం వర్క్ – డిజైనింగ్, ఎంబ్రాయిడరీ నైపుణ్యాలు
టైలరింగ్ – ప్రాక్టికల్ టైలరింగ్ స్మార్ట్ టెక్నిక్స్
బ్యూటీ పార్లర్ కోర్సు – మేకప్, హెయిర్ కట్టింగ్, స్కిన్ కేర్
ఈ శిక్షణ 30 రోజుల పాటు కొనసాగనుంది. మహిళలు ఈ కోర్సుల ద్వారా స్వంతంగా వ్యాపారం మొదలు పెట్టగల అవకాశాన్ని పొందగలరు.
అర్హతలు & దరఖాస్తు విధానం
- 18-45 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ మహిళలు
హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మహిళలు మాత్రమే అర్హులు
దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు: - విద్యార్హత సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
రిజిస్ట్రేషన్ వేదిక: సాంస్కృతిక విహార్ టిటిడిసి కార్యాలయం, హనుమకొండ
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: శిక్షణ కేంద్ర కార్యాలయం.
రిపోర్టర్. కళ్యాణి