తెలంగాణ ధ్వని: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారిని ఇంట్లో పందికొక్కులు(Porcupines bite) కొరికి చంపాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా (Palnadu) నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గురవయ్య, దుర్గమ్మ దంపుతులకు నాలుగు (4) నెలల బాలుడు ఉన్నాడు. ఎస్సీ కాలనీకి చెందిన ఆ దంపతులు కూలి పనులు చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే బాలుడిని (kid) ఉయ్యాలలో వేసి తల్లి దుర్గమ్మ టిఫిన్ కోసం బయటకు వెళ్లింది.
ఆ సమయంలో బాలుడు నిద్రపోతున్నాడు. తల్లి ఇంటికి వచ్చి చూడగా ఉయ్యాల వద్ద అలికిడి వినిపించింది. అక్కడ పందికొక్కులు కనిపించాయి. ఆమెను చూసి అవి పారిపోయాయి. ఆత్రుతతలో ఉయ్యాలలో ఉన్న బిడ్డను చూడగా బాలుడి కాలు, మొఖంపై తీవ్ర గాయాలు కనిపించాయి. ఆ బాలుడిని పందికొక్కులు కరిచాయని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రకత్నించారు. ఆస్పత్రికి తరలించే లోపే బాలుడు మృతి (child to death) చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు వేరే ప్రాతం నుంచి వలస కూలీలకు ఇక్కడికి వచ్చారని సమాచారం.
రిపోర్టర్: కిరణ్ సంగ…