తెలంగాణ ధ్వని: జఫర్ గడ్ మండల ప్రజలకు అటవీ శాఖ వారు కొన్ని సూచనలు చేశారు. స్టేషన్ ఘనపూర్ అటవీశాఖ ద్వారా తెలియజేయునది ఏమనగా..
మన జఫర్ గడ్ మండల పరిధిలో హైనా (కొండ్రీస్) అనే అడవి జంతువు సంచరిస్తున్నట్టు గుర్తించబడింది. అందువల్ల ప్రజలు నిర్ధిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి.
1. రాత్రిపూట పశువులను వ్యవసాయ బావుల వద్ద ఉంచవద్దు.
2. వ్యవసాయ బావుల వద్దకు రాత్రి సమయంలో వెళ్లేటప్పుడు ఖచ్చితంగా కాగాడా (లైట్) పట్టుకొని వెళ్ళాలి.
3. ఒక్కరే కాకుండా కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెళ్లాలి.
4. హైనా కనిపించినచో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి.
5. జఫర్ గడ్ FBO శిరీష – +91 80741 67418
ఈ సూచనలు మీ రక్షణ కోసమే. సహకరించగలరు అని స్టేషన్ ఘనపూర్ అటవీ శాఖ వారు ఒక ప్రకటనను విడుదల చేశారు.
రిపోర్టర్: కిరణ్ సంగ…