తెలంగాణ ధ్వని: # లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అవినీతి తిమింగలం
# ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘనపూర్ ఎస్ ఆర్వో రామకృష్ణ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పర్వతం రామకృష్ణను గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిల్పూరు మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారి ఇంటి రిజిస్ట్రేషన్ కొరకు సబ్ రిజిస్టర్ ను సంప్రదించగా ఒక్క డాక్యుమెంట్ కి 11 వేల రూపాయల చొప్పున రెండు డాక్యుమెంట్లకు 22000 డిమాండ్ చేశాడు. అంత చెల్లించలేమని బాధితులు చెప్పడంతో 20వేల కంటే తక్కువ తీసుకోనని ఎస్ ఆర్వో చెప్పాడు. దీంతో బాధితుడు బట్ట మేకల శివరాజు ఏసీబీ అధికారులను సంప్రదించడం జరిగింది. దీంతో సబ్ రిజిస్టార్ తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేష్ ద్వారా 20,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నేటి ఉదయం ఏసీబీ కోర్టులో నిందితులను హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా పనులు చేయడానికి లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సట్ల రాజు,ఎల్ రాజు, ఏసీబీ సిబ్బంది పాల్గోన్నారు.
రిపోర్టర్: కిరణ్ సంగ…