లబ్ధిదారులకు రూ.6,000 నేరుగా ఖాతాల్లో జమ
2025-26 బడ్జెట్‌లో రూ.18,000 కోట్లు కేటాయింపు
ఉగాది పండుగ నాటికి మొత్తం డబ్బులు జమ చేయాల్సిన ఆదేశాలు
పథకం లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు
తెలంగాణ ధ్వని : తెలంగాణ రైతులకు శుభవార్త ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను మార్చి 31వ తేదీ లోపు పూర్తిచేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కోసం రూ.18,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ముఖ్యంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు కూడా ఈ సాయాన్ని పొందనున్నారు.
రాష్ట్ర రైతులకు ఉగాది పండుగ నాటికి పూర్తి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో సీఎం కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రిపోర్టర్. దీప్తి