telanganadwani.com

ShaniShinganapur

శని సింగనపూర్ తలుపులేని గ్రామం, నమ్మకమే సంపదకు రక్షణ

తెలంగాణ ధ్వని : మన ఇంట్లో వస్తువులను భద్రపరచుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటికి తలుపులు చేయిస్తాము. అయితే ఇది అన్ని ప్రాంతాలలో అందరూ చేసే పనులు.
కానీ ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులూ ఉండవు. కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ భవనాలకి కూడా ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న తమ సంపదను తమ ఊరి లో కొలువైన ఒక దేవుడు రక్షిస్తాడని నమ్మకం.

ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే తలుపులు బిగించరు. ఆ గ్రామం మన దేశంలోనే ఉన్నది మహారాష్ట్రలోని శనిసింగనపూర్ లో ఇటువంటి సాంప్రదాయం ఉన్నది. అక్కడ శని దేవుడు వెలసిన పుణ్యక్షేత్రమని చెప్పవచ్చు. ఇక ఈ దేవుడు కూడా బయటవైపునే ఉంటారు ఎటువంటి ప్రత్యేక దేవాలయం కూడా ఉండదు. అందుకు కారణం అక్కడ శనీశ్వరుడు తమకు దేవాలయం అవసరం లేదని అక్కడి ప్రజలకు చెప్పినట్లుగా స్థానిక కథాంశం నుండి తెలుస్తోంది. అక్కడ ఈ దేవుడు స్వయంభువుడుని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.

ఇక ఇది షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో ఉన్నది. అయితే ఈ దేవుడిని చూడడానికి నల్లని గంభీరమైన రాతి విగ్రహం గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మనం ఈ దేవుడు ఏ కాలానికి చెందిన వారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడి ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం ఈ దేవుడిని పూజిస్తూ ఉంటారు. ఇక అక్కడి ప్రజలు కూడా ఈ దేవుడిని కొలుస్తూ ఉండడంతో వారి యొక్క విన్నపాలను వినిపిస్తుంటారు. ఇక అక్కడి భక్తులకు బందిపోట్ల సమస్య , జేబు దొంగలు సమస్య ఎక్కువగా ఉందని చెప్పడంతో వారికి ఆ దేవుడు మాట ఇచ్చారు అన్నట్లుగా ఒక గొర్రెల కాపరి ఆ ఊర్లోనే ఆ కథను చెబుతూ తిరుగుతూ ఉండే వారని సమాచారం.

ఇక ఈ గుడికి ఒక కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి ఇళ్ళ కైనా సరే తలుపులు అనేవి ఉండవు. ఆ వూరులో దొంగతనం జరిగినట్లు పోలీస్ స్టేషన్లో ఒక్క రికార్డు కూడా లేదట. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసి ఆ ఊరి నుండి దాటి వెళ్ళిపోతుంటే పొలిమేరలో రక్తం కక్కుకొని చనిపోతారని కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ గడచిన కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక బ్యాంకులో దొంగతనం జరిగింది. దీంతో డబ్బు దోచుకొని వెళ్ళినవారు పొలిమేరలో మరణించారు. ఈ సంఘటన తరువాత బ్యాంకు కార్యాలయానికి తలుపులను బిగించారు. దీంతో అక్కడ ఉండే వారు అంతా నిరసనలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ కూడా కొంత మంది ప్రజలు అక్కడ తమ ఇళ్లకు తలుపులు బిగించుకోలేదు. కానీ దొంగతనం చేసిన వారిని దేవుడు శిక్షించాడు అని అక్కడి ప్రజలు నమ్ముతారు.

రిపోర్టర్. ప్రతీప్  రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top