తెలంగాణ ధ్వని : నిజామాబాద్ ఎంపీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బుధవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేయగా, వారి అసత్య ప్రచారాలను ధిక్కరించారు. ఆమె పేర్కొన్నారు, “కాంగ్రెస్ పార్టీ రైతును రాజును చేయాలని చెప్పి, రైతు బంధు పథకాన్ని నీరుగార్చింది. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే రైతు బంధు పథకానికి దేశం మొత్తం చూస్తున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసగించాయి.”
అలాగే, ఆమె మాట్లాడుతూ, “కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే, జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. దాంతో ఒక్కో మహిళకూ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇది సిగ్గుచేటు,” అన్నారు.
కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన కల్యాణ లక్ష్మీ పథకం మరియు తులం బంగారం పథకం పట్ల కూడా విమర్శలు చేసిన కవిత, “రేవంత్ రెడ్డి 16 నెలలుగా హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేయకపోవడం దురదృష్టకరం” అని చెప్పారు.
నిరుపేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ రూపొందించిన గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాడుచేసిందని ఆమె ఆరోపించారు. “ఈ కారణంగా, నిరుపేద విద్యార్థులు పెద్ద ఇబ్బందులు పడుతున్నారు,” అని ఆమె పేర్కొన్నారు.
ఈ మధ్య, ఆమె వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ మరియు తెలంగాణ కుంభమేళా కోసం, రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. 27వ తేదీన జరిగే ఈ సభను మరింత విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని ఆమె కోరారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక