తెలంగాణ ధ్వని : పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు సికింద్రాబాద్(Secundrabad) లోని ఓ పాత గోదాంపై పోలీసులు దాడులు చేశారు. తీరా అక్కడ పడి ఉన్న నోట్ల కట్టలను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాదాపు రూ.8 కోట్లకు పైగా నగదు గోదాంలో పడి ఉండటంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఆ డబ్బంతా ఏటీఎంలలో డబ్బును డిపాజిట్(ATM Deposit Money) చేసే సంస్థకు చెందినదిగా తేల్చారు. వారి ఏజెన్సీలో జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది వారం రోజుల నుంచి విధులు బహిష్కరించారని, ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బు భారీగా పోగు పడటంతో ఏం చేయాలో తెలియక అక్కడ దాచారని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఏటీఎం ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా అత్యంత రద్దీగా ఉంటే సికింద్రాబాద్ నడిబొడ్డున నోట్ల కట్టలు గుట్టలుగా పడి ఉండటం స్థానికంగా సంచలనం కలిగించింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక