తెలంగాణ ధ్వని : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి, కానీ తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఆలస్యం కావడంతో విద్యార్థులలో అనిశ్చయంగా ఉంది. అయితే, తాజాగా ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
తెలంగాణలో ఈనెల 30వ తేదీన పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి, వారం రోజుల క్రితమే టెన్త్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ మరియు సమాధాన పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే, విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆధీనంలో ఉండటంతో, ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయాలని అధికారుల అనుమతి తీసుకున్నారు.
ఈ విషయంపై ఇటీవల రేవంత్ రెడ్డి మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. ఈ క్రమంలో, ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించారని అధికారులు తెలిపారు. ఇక, ఫలితాల విడుదలపై అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక