telanganadwani.com

DGPSelection

డీజీపీ పదవికి పోటీలో 8 మంది ఐపీఎస్ అధికారులు – రాష్ట్ర ప్రభుత్వం UPSCకు పేర్లు పంపించింది

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్ర డీజీపీ పదవి కోసం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది.

యూపీఎస్సీకి పంపిన అధికారులు వారి బ్యాచ్‌ల వారీగా:

1990 బ్యాచ్: రవి గుప్తా  (పదవీ విరమణ: 2025 డిసెంబర్ 19)

1991 బ్యాచ్: సీవీ ఆనంద్  (పదవీ విరమణ: 2028 జూన్)

1992 బ్యాచ్: డాక్టర్ జితేందర్ (ప్రస్తుత డీజీపీ, పదవీ విరమణ: 2025 సెప్టెంబర్ 6)

1994 బ్యాచ్: ఆప్టే వినాయక్ ప్రభాకర్ (పదవీ విరమణ: 2029 అక్టోబర్)

1994 బ్యాచ్: కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (పదవీ విరమణ: 2025 ఆగస్టు 5)

1994 బ్యాచ్: బి. శివధర్ రెడ్డి (పదవీ విరమణ: 2026 ఏప్రిల్ 28)

1994 బ్యాచ్: డాక్టర్ సౌమ్య మిశ్రా (పదవీ విరమణ: 2027 డిసెంబర్ 30)

1994 బ్యాచ్: శిఖా గోయల్ (పదవీ విరమణ: 2029 మార్చి)

యూపీఎస్సీ ఈ జాబితా నుండి అర్హత ఆధారంగా ముగ్గురి పేర్లను సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపుతుంది.అర్హతలు, సీనియార్టీ ఆధారంగా యూపీఎస్సీ ఈ జాబితా నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది.

ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా. జితేందర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నాడు. ఇతర అధికారుల పదవీ విరమణ తేదీలు కూడా రేసును ఆసక్తికరంగా మార్చుతున్నాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top