తెలంగాణ ధ్వని : తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన విడుదల చేశారు.
ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అందులో రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశేషంగా, ఈసారి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్ల కంటే అత్యధిక ఉత్తీర్ణత నమోదు అయింది. ఫలితాలు ప్రకారం, బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పదవ తరగతి పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. మొత్తం 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల ద్వారా చూడవచ్చు: https://results.bsetelangana.org లేదా https://results.bse.telangana.gov.in.
ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇవ్వబడేది. అయితే, ఇకనుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు అందించబడతాయి. అలాగే, మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షల మార్కులు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు మరియు గ్రేడ్లను ముద్రించనున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక