తెలంగాణ ధ్వని : పూణేకు చెందిన డాక్టర్ గణేష్ రఖ్ లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ అభినందనీయంగా పనిచేస్తున్నారు. సమాజంలో ఆడపిల్ల పుట్టడం విషాదకరంగా చూస్తున్న ఈ రోజుల్లో, ఆయన ఆ ఆడపిల్ల పుట్టిన రోజు పండగలా జరుపుకుంటారు.
తన స్వంత ఆసుపత్రిలో ఆడబిడ్డ పుట్టిన తల్లికి ఉచితంగా ఆపరేషన్ చేసి, స్వీట్లు పంచి, కేక్ కట్ చేయిస్తారు. ఈ విధంగా 2012 నుంచి ఇప్పటివరకు దాదాపు 2000 ఉచిత ప్రసవాలు చేశారు. ఇది కేవలం వైద్య సేవ కాదు, ఒక సామాజిక ఉద్యమం.
ఆడపిల్లలను తక్కువగా చూసే మనవారి దృష్టికోణాన్ని మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. “ఆడపిల్లేనా! ఎంత అదృష్టం!” అనే గర్వంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
మహిళల పుట్టుకను సంబరంగా జరుపుకోవాలన్నది ఆయన ఆకాంక్ష. ఇది ఒక వైద్యుడి బాధ్యతకంటే మిన్న ఇది మానవత్వానికి జీవం పోసే ప్రక్రియ. మహిళల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉన్న సమయంలో ఆయన చర్యలు ప్రేరణగా నిలుస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో కన్యాశుల్కం రావడం ఆడపిల్లల కొరతను సూచిస్తోంది. అలాంటి సమాజంలో డాక్టర్ గణేష్ రఖ్ వంటి వ్యక్తులు మార్పుకు మూలస్తంభంగా నిలుస్తున్నారు. వారి సేవలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
సమాజంలో లింగ సమానత్వం రావాలంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి దృక్పథం అవలంబించాలి. ఆడపిల్లలకు గౌరవం ఇవ్వడం మన సమాజ అభివృద్ధికి ముఖ్యమైన పునాది.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక