telanganadwani.com

RajivYuvaVikasam

హార్డ్ కాపీలకు మరో అవకాశం – రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కి ప్రభుత్వం కీలక అప్డేట్…

తెలంగాణ ధ్వని : రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి దరఖాస్తుల పరిశీలన తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నది. ఇప్పటికే దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది.

అయితే, కొందరు అభ్యర్థులు హార్డ్ కాపీలను సమర్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. హార్డ్ కాపీలు సమర్పించని వారు తక్షణమే మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు లేదా వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి.

దీనితో పాటు, అప్లికేషన్‌ను వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమ ఐడీ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేసి వివరాలను చూసుకోవచ్చు. తద్వారా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు.

స్కీమ్ కింద ఎక్కువ మంది కిరాణా షాపులు, టెంట్ హౌజులు వంటి చిన్న వ్యాపారాలపైనే ఆసక్తి చూపారు. అర్హతల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2న పత్రాలు అందజేయనున్నారు.

రుణాలు రూ. 50 వేలు నుంచి రూ. 4 లక్షల వరకూ ఇవ్వనున్నారు. కేటగిరీ-1 కింద వందశాతం రాయితీతో బ్యాంక్ లింకేజ్ లేకుండా అమలు చేస్తారు. ఇతర కేటగిరీల్లో మాత్రం బ్యాంక్ లింకేజీ తప్పనిసరి.

ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. ఇది ఆర్థికంగా వెనుకబడిన యువతకు ఎంతో ఉపయోగపడే అవకాశముంది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top