telanganadwani.com

DomesticViolence

భార్య ముక్కు, వేలిని కొరికిన భర్త – బంగాల్‌లో హృదయవిదారక ఘటన…

తెలంగాణ ధ్వని : ఇంట్లో రాత్రి నిద్రపోతున్న భార్య ముక్కును బలంగా కొరికి నమిలి తినేశాడు ఓ..భర్త, దీంతో ఆమె ముక్కు భాగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఉలిక్కిపడిలేచిన భార్య, తన భర్తను చూసి హడలిపోయి బయటకు పరుగులు తీసింది.
అనంతరం ఆమెను వెంటాడుతూనే వెళ్లి వేలునూ రక్తం కారేలా గట్టిగా కొరికాడు. ఈ దారుణ ఘటన *బంగాల్​లోని నదియా జిల్లాలో* జరిగింది.
నదియా జిల్లా శాంతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ఏరియాలో *బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తున్నారు.
వీరిద్దరూ ప్రేమించుకుని, తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా *ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది.అయితే  రాత్రి పడుకున్న తర్వాత.,  తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
మధు ఖాతూన్ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. మధు ఖాతూన్, తన తల్లి రేష్మా బేగంతో కలిసి వెళ్లి శాంతీపూర్ పోలీసు స్టేషన్‌లో భర్త బాపన్ షేక్‌పై ఫిర్యాదు ఇచ్చింది.
 ఫిర్యాదులో ఏముందంటే…?
‘‘నా భర్త (బాపన్ షేక్) తరుచుగా మద్యం తాగొచ్చి నా అందాన్ని పొగిడేవాడు. చాలా అందంగా ఉన్నావని కితాబిచ్చేవాడు. *నా ముక్కు చాలా బాగుందనే వాడు.
అవకాశం దొరికితే నా ముక్కును కొరికి తినేస్తాననే వాడు.* ఫిబ్రవరి 2న రాత్రి 3 గంటలకు *నా..భర్త చెప్పినంత పనీ చేశాడు.* నిద్రిస్తుండగా నా ముక్కును కొరికాడు. అక్కడి నుంచి పారిపోతుండగా నా వేలిని కొరికాడు.
అందాన్ని పాడు చేసేందుకు మొహంపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు’’ అని పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో మధుఖాతూన్ పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు బాపన్ షేక్‌ను అరెస్టు చేసి రాణాఘాట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. బాపన్ షేక్‌ను తమ కస్టడీకి అప్పగించమని కోర్టును పోలీసులు కోరారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top