తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో నీటి సరఫరా కీలకమైన అంశంగా మారింది, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ప్రాణహిత ప్రాజెక్టు ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
ప్రస్తుతం, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా లక్ష్యాలను సాధించడంలో నిరుత్సాహకరమైన ఫలితాలు ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ప్రభుత్వం పాత ప్రాణహిత ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, సమర్ధవంతమైన నీటి నిల్వలు కలిగి ఉండకపోవడం వంటి కారణాల వల్ల అందులోని సాధారణ పనితీరు ప్రశ్నార్థకమైంది.
ముఖ్యంగా, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర అభ్యంతరాలు ఉన్నాయి. మహారాష్ట్ర 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి తగిన అనుమతులు ఇవ్వడం లేదు,
దీంతో తుమ్మిడిహెట్టి దిగువన ప్రత్యామ్నాయంగా బోరేపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసే ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియకు సంబంధించి పలు టెక్నికల్ అంశాలను సమీక్షించి, ఎక్కడ బ్యారేజీని నిర్మించాలో నిర్ణయించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే, 71.5 కిలోమీటర్ల కెనాల్స్ నిర్మించబడినందున, వాటితో కూడి నీటిని ఎల్లంపల్లి వరకు తరలించేందుకు లిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయడం సాధ్యం అవుతుంది.
తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మాణంపై కూడా ఒక సిఫార్సు ఉంది, అయితే అది టైగర్ రిజర్వ్‌ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తయారు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
గతంలో 2007లో ఈ ప్రాజెక్టు మీద స్టడీలు చేసినప్పటికీ, ఇప్పటి పరిస్థితుల ఆధారంగా మరింత అధ్యయనం అవసరమని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా, మేడిగడ్డ బ్యారేజీపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ద్వారా మరమ్మతులు, రిపేర్లు చేసే సూచనలు కూడా వున్నాయి, అయితే 16 టీఎంసీల నీటి సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీను పూర్తిగా వినియోగించడం సాధ్యం కాదని చెప్పబడింది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక