telanganadwani.com

MissWorld2025

భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ మిస్ వరల్డ్ 2025 పై తాజా సమాచారం

తెలంగాణ ధ్వని :  ఇటీవల భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరియు మిస్ వరల్డ్ సంస్థ సంయుక్తంగా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి.

ముగింపు సమయానికి నగరంలోని ఏర్పాట్లన్నీ పూర్తి కాగా, భద్రతా పరంగా అత్యున్నత స్థాయి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 116 దేశాల నుండి 109 మంది పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.                                                                              ఇంకా రావాల్సిన అతిథులు, స్పాన్సర్లు, మీడియా ప్రతినిధుల రాకపై ఎయిర్‌పోర్ట్ సేవల్లో ఏర్పడిన అంతరాయాల వల్ల కొంత అవాంతరం ఎదురవుతోంది.

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి రిహార్సల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. పాతబస్తీ, చార్మినార్, బుద్ధవనం, రామప్ప ఆలయం వంటి పర్యాటక ప్రదేశాల్లో జరిగే ఔట్‌డోర్ ఈవెంట్ల భద్రతను ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. పరిస్థితులను బట్టి మిస్ వరల్డ్ 2025 పోటీలను యథాతథంగా నిర్వహించాలా లేదా తాత్కాలికంగా వాయిదా వేయాలా అనే విషయంపై తుదినిర్ణయం త్వరలో ప్రకటించబడుతుంది.

ప్రజలు మరియు మీడియా సంస్థలు అధికారిక సమాచారం కోసం మాత్రమే ఆధారపడాలని, అనవసరమై ఊహాగానలనుమనవి.

రిపోర్టర్ అనుష కల్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top