తెలంగాణ ధ్వని : ఆ శక్తి పీఠమే హింగ్ లాజ్ మాత. అప్పట్లో పాకిస్థాన్ లో ఉండేది. ఇప్పుడు బలూచిస్థాన్ ప్రత్యేక దేశం అంటోంది కాబట్టి హింగ్ లాజ్ మాత ఆలయం బలూచిస్థాన్ కిందకు వస్తుంది.
అందుకే రండి రారండి ఇండియన్స్ దర్శనం చేసుకోండి అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు బలూచిస్థాన్ వాసులు.
సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీటాలు అని చెబతారు. వాటిలో 18 ని అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. ఇవే ముఖ్యమైనవి. కానీ వేర్వేరు గ్రంధాల్లో శక్తి పీఠాలు 51, 55, 108 ఇలా వివిధ రకాల లెక్కలు చెబుతారు.
‘హింగ్లాజ్దేవి’ శక్తిపీఠంగా పేర్కొంటారు. పాకిస్తాన్లో కరాచీకి 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగ్లాజ్ దేవి ఆలయం.
రీసెంట్ భారత్ పై పాక్ ఉగ్రదాది..ఉగ్రవాద స్థావరాలు పేల్చేసింది. ఆ తర్వాత మన పౌరులపై, సైనికులపై పాకిస్థాన్ సైనికులు విరుచుకుపడ్డారు.
ఆ సమయంలో బలూచిస్థాన్ భారత్ కి సపోర్ట్ చేసింది. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కావాలంటూ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. ఇందులో భాగంగా భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది.
స్థలపురాణం ప్రకారం అమ్మవారి తలలో కొంత భాగం ఇక్కడ పడిందని చెబుతారు. అందుకే ఇక్కడ విగ్రహానికి ఓ రూపు ఉండదు. చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పూసిన రాయి కనిపిస్తుంది.
సంస్కృతంలో సింధూరాన్ని ‘హింగళము’ అంటారు..అందుకే హింగ్లాజ్మాత అని పూజలందిస్తారు భక్తులు. మరో పురాణ కథ ప్రకారం ఒకప్పుడు హింగులుడనే రాక్షసుడు ప్రజల్ని పీడించేవాడు.
ఆ రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు అవతరించిందని చెబుతారు. హింగలుడు ఓ గుహలోకి వెళ్లినప్పుడు అమ్మవారు, హింగలుడిని సంహరించారు. అప్పటి నుంచి అమ్మవారికి హింగ్ లాజ్ అనే పేరు స్థిరపడింది.
హింగ్లాజ్దేవి ఆలయం లోయల మధ్య ఉంటుంది. అప్పట్లో ఈ ఆలయానికి చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పెరిగిన సదుపాయాలతో కష్టపడాల్సిన అవసరం లేదు.
పైగా నిరంతరం ఆలయం సందడిగానే ఉంటుంది. ఏటా ఏప్రిల్ లో నాలుగు రోజుల పాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
అనారోగ్యంతో బాధపడినవారు, ఆపదలు ఎదుర్కొనేవారు హింగ్ లాజ్ మాతని దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే
ఎంతో దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియుల్లో కొన్ని శాఖల వారికి ఈ అమ్మ కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్నప్పుడు హింగ్ లాజ్ మాత కొందరు క్షత్రియులను రక్షించిందట..
అందుకే వారి వారసులు ఇప్పటికీ ఆమెను కొలుస్తారు.కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా హింగ్ లాజ్ మాతని ఆరాధిస్తారు. వారంతా నానీ కీ మందిర్ అని పిలుస్తారు.
అమ్మవారికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. పాకిస్థాన్ లో దేవాలయాలన్నీ కాలగర్భంలో కలసిపోయినా..హింగ్ లాజ్ మాత ఆలయం ఇప్పటికీ చెక్కుచేదరకుండానే ఉంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక