telanganadwani.com

Thudakkam

మోహన్‌లాల్ తుడరుమ్ మే 23 లేదా 30న జియోసినిమాలో స్ట్రీమింగ్‌కి సిద్ధం!..

తెలంగాణ ధ్వని : మాలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితేమే ఎల్2 ఎంపురాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మలయాళంలో అత్యధిక వసూళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.

ఇది మరవకముందే మరో బ్లాక్ బస్టర్ తో మన ముందుకొచ్చాడీ కంప్లీట్ స్టార్. ఆయన నటించిన లేటెస్ట్ తుడరుమ్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది.

ఏప్రిల్ 25న మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 200 కోట్లు దాటి పోయాయి.

తెలుగులోనూ ఈ మూవీకి మంచి వసూళ్లే దక్కాయి. సరిగ్గా ప్రమోషన్స్ చేసి ఉంటే కలెక్షన్లు దక్కేవంటున్నారు ట్రేడ్ నిపుణలు. మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మోహన్ లాల్ కు జంటగా శోభన నటించింది.

దృశ్యం మూవీ తరహాలోనే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా తుడరుమ్ తెరకెక్కింది. ఇప్పటికీ మలయాళంలో ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.

ఇదే క్రమంలో ఈ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

తుడరుమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజైన నెలరోజుల తర్వాత ను స్ట్రీమింగ్ చేయాలని డీల్ కుదిరింది.

అంటే మే 23 లేదా 30వ తేదీల్లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కు థియేటర్లలోనే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. కాబట్టి స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది.

రిపోర్టర్.ప్రతీప్ రడపాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top