telanganadwani.com

KondaSurekha

ఉపాధ్యాయులు నైపుణ్యాలు మెరుగుపర్చుకొని విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలి, మంత్రి కొండా సురేఖ.

  • ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ.
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి హాజరైన మంత్రి.KondaSurekha
తెలంగాణ ధ్వని : శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్య  బోధించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ తెలిపారు.
గురువారం  వరంగల్ లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షత కార్యక్రమంలో భాగంగా మూడవరోజు మంత్రి శ్రీమతి కొండ సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్యసారదాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి కొండ సురేఖ మాట్లాడుతూ  అన్నిటికన్నా గొప్పదానం విద్యాదానం అని,  సమాజంలో ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉందని ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విద్యార్థులను ప్రభావితం చేస్తాయన్నారు.
విద్యార్థులకు వారి స్థాయికి అనుగుణంగా వారిలో ఆసక్తిని పెంపొందించే విధంగా  బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
శిక్షణలు నేర్చుకున్న నైపుణ్యాలను తరగతి గదిలో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి దోహదపడేలా చూడాలన్నారు.   విద్యాబోధనే కాకుండా క్రీడలలో కూడా విద్యార్థుల నైపుణ్యాలను వేలికి తీసి వారిని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడాకాలుగా తయారు చేయాలన్నారు.
తమ ప్రభుత్వం మాత్రం విద్య వ్యవస్థకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యార్థుల వసతి గృహాల డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీల పెంచిందని అన్నారు.
కుల మతాలకతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించుటకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లను  ఏర్పాటు చేస్తున్నట్లు అందులో భాగంగా ఉర్స్ కరిమాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
హైద్రాబాద్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్ష ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయులకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు శిక్షణ   కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థులకు బోధించే పద్ధతులను  మెరుచుకుపరుచుకోవాలని నూతన  గీతికతలను ఉపయోగించి విద్యార్థుల అవసరాల కనుగుణంగా బోధన పద్ధతులను మార్చుకోవాలన్నారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని మంచి ఫలితాలు వస్తాయన్నారు.  విద్యార్థుల పురోగతిని అంచనా వేసి వారిలో నైపుణ్యాలను మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్,   జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్ తేజ అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు సెంటర్ ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top