తెలంగాణ ధ్వని : హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చేతన్ జువెలర్స్ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్న నితీష్ జైన్ అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం , ఆభరణాలతో పరారయ్యాడు.
దీంతో మోసపోయిన కస్టమర్లు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నితీష్ జైన్ గత కొంతకాలంగా కస్టమర్ల నుండి బంగారాన్ని తీసుకుని ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు.
కస్టమర్లకు నమ్మకం కలిగించిన తర్వాత, మే 10వ తేదీ నుండి షాపును తెరవకుండా అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు షాపు వద్దకు చేరుకుని చూడగా అది మూసి.
ఈ మోసంతో కేవలం కస్టమర్లే కాకుండా, జైన్‌కు బంగారాన్ని అప్పుగా ఇచ్చిన ఇతర నగల వ్యాపారులు కూడా లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా, కొంతమంది వ్యక్తులు బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు జైన్‌కు నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నితీష్ జైన్ వివిధ రకాల స్కీమ్‌లు పెట్టి కూడా అమాయక ప్రజలను మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు నితీష్ జైన్ కేపీహెచ్‌బీ కాలనీ , బాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ.
ఈ మోసానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నితీష్ జైన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక