తెలంగాణ ధ్వని : ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 22న తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం కానున్నాయి.
దేశ వ్యాప్తంగా మొత్తం 102 స్టేషన్లు పునః ప్రారంభం కానుండగా, అందులో మూడు తెలంగాణా రాష్ట్ర రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
ఇక ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్ల వివరాలలోకి వెళితే26.55 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా బేగంపేట రైల్వే స్టేషన్
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి చేశారు. 26.55 కోట్ల రూపాయల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు.
కొత్త స్టేషన్ భవనం,12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్ షెల్టర్, లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు, కొత్త వెయిటింగ్ హాల్, కొత్త టాయిలెట్లు ఇలా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక