telanganadwani.com

DisabilitySupport

భవిత కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ..

 తెలంగాణ ధ్వని : దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లలో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ ముఖరంపుర లోని భవిత సెంటర్ ను సోమవారం  సందర్శించారు. ఇక్కడ పెయింటింగ్ పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
InclusiveEducationపిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలని అన్నారు. సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని, పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన కోసం అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని ఆదేశించారు. రెయిలింగ్, ర్యాంపు రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు.
ఫిజియోథెరపిస్టు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలని అన్నారు.  జిల్లాలోని హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్, తిమ్మాపూర్ భవిత కేంద్రాల్లోనూ ఇదే విధంగా పెయింటింగ్ పనులను చేయించాలని అన్నారు.
భవిత సెంటర్లలో వాల్ పెయింటింగ్స్, ప్లే వే మెటీరియల్ ఏర్పాటు చేయడంతో పాటు చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
భవిత సెంటర్ల ఆధునీకరించే పనులు త్వరగా పూర్తిచేసి జూన్ 1 నుండి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. దివ్యాంగ విద్యార్థులను ఈ కేంద్రాల్లో చేర్పించి వారి మనోవికాస అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిసిడివో కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కురి శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top