- ఒకేసారి రెండు ప్రధాన మూత్రశయ శస్త్రచికిత్సలు విజయవంతం!
- డా. సిరీష్ భారద్వాజ్
తెలంగాణ ధ్వని : మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో ఒకే సర్జన్, ఒకే సెషన్‌లో, రెండు ప్రధాన మూత్రశయ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసారు .
42 ఏళ్ల వ్యక్తి, గత 8 ఏళ్లుగా శరీరంలోనే ఉండిపోయిన, పూర్తిగా ఎన్‌క్రస్ట్ అయిన, విరిగిన DJ స్టెంట్‌తో బాధపడుతున్నారు.
దేశంలోని పలు కేంద్రాలు మూత్రపిండం తొలగించాల్సిందేనని సూచించిన సందర్భంలో, డా. డి. సిరీష్ భారద్వాజ్ గారు మూత్రపిండాన్ని రక్షిస్తూ, Supine PCNL మరియు ఓపెన్ సుప్రాప్యూబిక్ సిస్టోలిథోటమీని సమన్వయంగా నిర్వహించారు.
స్కానింగ్‌లో 21×16 మిమీ రీనల్ రాయి మరియు 51x42x31 మిమీ బ్లాడర్ రాయి ఉండటంతో పాటు, స్టెంట్ చివరి భాగం బ్లాడర్‌లోకి జారినదిగా గుర్తించబడింది.
ఇది FECAL Grade IV స్థాయికి సరిపడే క్లిష్టమైన ఎన్‌క్రస్టేషన్ కేసు. అలాంటి విపరీత స్థితిలో, ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మెడికవర్ వైద్య బృందం మూత్రపిండాన్ని తొలగించకుండా కాపాడేందుకు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
Supine PCNL ద్వారా మూత్రపిండ రాయి తొలగింపు, పాత స్టెంట్ తీసివేత, కొత్త స్టెంట్ అమరిక పూర్తయ్యాయి. ఆ తరువాత బ్లాడర్ గోడ పాడవడంతో, ఓపెన్ సుప్రాప్యూబిక్ సిస్టోలిథోటమీ కూడా పూర్తయ్యింది.
రోగిని తిరిగి తిప్పాల్సిన అవసరం లేకుండా, ఈ శస్త్రచికిత్సలు పూర్తిగా సుపైన్ పొజిషన్‌లోనే విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
పోస్ట్-ఆపరేటివ్ దశలో పేషెంట్ ఎలాంటి సంక్షోభాలు లేకుండా పూర్తిగా కోలుకున్నారు. రెండో వారం నాటికి పి.యు.సి తొలగించబడింది, నాలుగో వారం నాటికి SPC తొలగించబడింది.
ప్రస్తుతానికి సహజంగా మూత్ర విసర్జన జరుగుతోంది. 6 వారాల తర్వాత DJ స్టెంట్ తొలగించి, మూత్రపిండ పనితీరు DTPA స్కాన్ ద్వారా అంచనా వేయనున్నారు.
డా. సిరీష్ భారద్వాజ్ గారు మాట్లాడుతూ ఈ రెండు ఆపరేషన్లు సాధారణమైనవే అయినా, ఒకే సెషన్‌లో, ఒకే స్థితిలో, రోగిని తిప్పకుండా పూర్తిచేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదే. కానీ, ఇది మా వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనం.’’ అని తెలిపారు.
ఈ అరుదైన శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్స్‌లోని ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణుల నైపుణ్యం, పేషెంట్ కేంద్రిత చికిత్స విధానాలకు ఈ శస్త్రచికిత్స మెడికవర్ నైపుణ్యానికి ప్రతిబింబంగా నిలిచింది.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక